రహస్య విహరణ అనేది మీరు విహారిణిని మూసివేసినపుడు అది స్వయంచాలకంగా మీ సంకేతపు మాటలు, కుకీలు, చరిత్ర వంటి మీ విహరణ సమాచారాని తుడిచివేస్తుంది. ఫైర్‌ఫాక్స్ కొత్త రూపాంతరాల్లో కంటెంట్‌ని అడ్డగించుట (ట్రాకింగ్ రక్షణ)కంటెంట్‌ని అడ్డగించుట దాగినున్న ట్రాకర్లు వివిధ సైట్లనుండి మీ సమాచారాన్ని సేకరించి, మీ విహరణని నెమ్మదించడాన్ని ఆపుతుంది.
విషయాల పట్టిక
నేను ఒక కొత్త రహస్య విహరణ విండో ఎలా తెరవగలను?
ఒక కొత్త రహస్య విహరణ విండో తెరవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
కొత్త, ఖాళీ రహస్య విహరణ విండో తెరువు
- మెను బొత్తాన్ని నొక్కండి, ఆపై
కొత్త రహస్య విహరణ విండోలో లంకెను తెరువు
- కుడి క్లిక్అది నొక్కే ముందు Ctrl నొక్కి ఉంచండి
ఏ లంకెపైనైనా మరియు విషయ మెనూ నుండి ఎంచుకోండి.
రహస్య విహరణ వేటిని భద్రపరచదు?
- చూసిన పేజీలు: చరిత్ర మెనులో సైట్ల జాబితాకు, లైబ్రరీ విండో యొక్క చరిత్ర జాబితాకు, లేదా చిరునామా బార్ డ్రాప్ డౌన్ జాబితాకు పేజీలు చేర్చబడవు.
- ఫారం, శోధన బార్ నమోదులు: వెబ్ పేజీల్లోని టెక్స్ట్ బాక్సుల్లో లేదా శోధన బార్లో మీరు నమోదు చేసినవి ఫారం స్వయంపూరణ కొరకు భద్రపరచబడవు.
- పాస్‌వర్డ్‌లు: కొత్త పాస్‌వర్డ్‌లు భద్రపరచబడవు.
- దింపుకోలు జాబితా నమోదులు: రహస్య విహరణను ఆపివేసిన తరువాత మీరు దింపుకున్న దస్త్రాలు ఏవీ దింపుకోళ్ళ విండోలో చూపించబడవు.
- కుకీలు: కుకీలు మీరు సందర్శించిన వెబ్ సైట్ల గురించి సైట్ ప్రాధాన్యతలు, లాగిన్ స్థితి, మరియు అడోబె ఫ్లాష్ వంటి ప్లగిన్లు ఉపయోగించే డేటా వంటి సమాచారాన్ని భద్రపరుస్తాయి. అన్యవ్యక్తులు మిమ్మల్ని వివిధ వెబ్సైట్ల ద్వారా అనుసరించడానికి కూడా కుకీలు ఉపయోగపడతాయి. ట్రాకింగ్ గురించి మరింత సమాచారం కోసం నేను Do Not Track ఫీచర్ ను ఎలా ఆన్ చేయాలి? చూడండి. రహస్య విండోలలో సెట్ చేయబడిన కుకీలు మామూలు విండో కుకీలకంటే వేరుగా ఉండి, తాత్కాలికంగా మెమొరీలో ఉంచబడి, మీ రహస్య సెషన్ ముగిసినపుడు (చివరి రహస్య విండో మూసివేయబడినపుడు) తీసివేయబడతాయి.
- దాచబడ్డ వెబ్ కంటెంట్, జతపరచని వెబ్ కంటెంట్ మరియు యూజర్ డేటా: తాత్కాలిక జాల దస్త్రాలు (దాచబడ్డ దస్త్రాలు) లేదా జతపర్చని వినియోగం కోసం వెబ్సైట్లు భద్రపరిచే దస్త్రాలు - ఇవి ఏవీ భద్రపరచబడవు.
- రహస్య విహరణ ఉపయోగించునపుడు మీరు రూపొందించే కొత్త ఇష్టాంశాలు భద్రపరచబడతాయి.
- రహస్య విహరణ ఉపయోగించునపుడు మీరు మీ కంప్యూటరుకు దింపుకునే ఏ దస్త్రాలైనా భద్రపరచబడతాయి.
ఫైర్‌ఫాక్స్ ఎల్లప్పుడూ రహస్య విహరణను వాడేలా అమర్చుకోవచ్చా?
ఫైర్‌ఫాక్స్ చరిత్రను గుర్తుంచుకునేలా అప్రమేయంగా అమర్చబడుతుంది, కానీ మీరు ఫైర్‌ఫాక్స్ గోప్యతలో ఈ అమరికను మార్చవచ్చు ఎంపికలుప్రాధాన్యతలు :
- టెంప్లేట్ "Optionspreferences" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.
- ప్యానెల్ ఎంచుకుని "చరిత్ర" విభాగానికి వెళ్లండి.
- డ్రాప్ డౌన్ మెను నుండి "చరిత్రను ఎప్పుడూ గుర్తుంచుకోవద్దు" ఎంచుకోండి.
ఇది ఎల్లప్పుడూ రహస్య విహరణ రీతిలో ఉండడంతో సమానం.
ఫైర్ఫాక్స్ భద్రపరిచే సమాచారాన్ని నియంత్రించడానికి ఇతర మార్గాలు
- ఒక సైటును సందర్శించిన తరువాత మీరు ఎల్లప్పుడూ ఇటీవలి విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించుట చేయవచ్చు.
- ఈ అంశంపై మరిన్ని వ్యాసాలను చదవండి: పాస్వర్డులు, ఫారంలు, శోధన, మరియు చరిత్ర - ఫైర్ఫాక్స్ సూచనలను నియంత్రించు