మీ సంస్థ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీకు లేదా ప్రాక్సీని ఉపయోగించుకోవచ్చు. ప్రాక్సీ మీ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఇది దాని కాష్ను ఉపయోగించి అభ్యర్ధనను పూర్తి చేయగలదో అని చూడడానికి అన్ని అంతర్జాల అభ్యర్థనలను అడ్డగిస్తుంది. పనితీరు, వడపోత అభ్యర్థనలను మెరుగుపరచడానికి మరియు భద్రతను మెరుగుపరచడానికి మీ కంప్యూటరును అంతర్జాలం నుండి దాచడానికి ప్రాక్సీలు ఉపయోగించబడతాయి. ప్రాక్సీలు తరచుగా సంస్థల కంప్యూటరు రక్షణ సాధనాల్లో ఒక భాగంగా ఉంటాయి.
ఒక ప్రాక్సీని ఉపయోగించడానికి కనెక్షన్ అమరికలు ఫైర్ఫాక్స్లో ఈ క్రింది విధంగా అమర్చవచ్చు ఎంపికలుప్రాధాన్యతలు :
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- Network ProxyNetwork Settings విభాగానికి వెళ్లండి. ప్యానెలులో
- No proxy: మీరు ప్రాక్సీని ఉపయోగించకూడదనుకుంటే దీన్ని ఎంచుకోండి.
- Auto-detect proxy settings for this network: ఫైర్ఫాక్స్ మీ నెట్వర్క్ కోసం ప్రాక్సీ అమరికలను స్వయంచాలకంగా గుర్తించాలని మీరు కోరుకుంటే దీన్ని ఎంచుకోండి.
- Use system proxy settings: మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం కాన్ఫిగర్ చేసిన ప్రాక్సీ అమరికలను ఉపయోగించాలనుకుంటే దీన్ని ఎంచుకోండి.
- Manual proxy configuration: మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాక్సీ సర్వర్ల జాబితాను కలిగి ఉంటే దీన్ని ఎంచుకోండి. ఆకృతీకరణ సమాచారము కొరకు మీ సిస్టమ్ నిర్వాహకుడిని అడగండి. ప్రతి ప్రాక్సీకి హోస్ట్ పేరు మరియు పోర్ట్ సంఖ్య అవసరం.
- అన్ని ప్రొటోకాల్సుకు అదే ప్రాక్సీ పేరు మరియు పోర్ట్ సంఖ్య ఉపయోగించబడి ఉంటే, Use this proxy server for all protocols ఎంచుకోండి.
- No Proxy For: హోస్ట్ నేమ్స్ లేదా IP చిరునామాల జాబితా ప్రాక్సీ చేయబడదు. అన్ని హోస్ట్ నామాల కోసం ప్రాక్సీని దాటవేయడానికి <local> ను ఉపయోగించండి, ఇవి పూర్ణవిరామాలను కలిగిఉండవు.
- Automatic proxy configuration URL: మీకు ఒక ప్రాక్సీ ఆకృతీకరణ (.pac) ఫైల్ ఉంటే దీన్ని ఎంచుకోండి. మార్పులను భద్రపరచి, ప్రాక్సీ ఆకృతీకరణను లోడ్ చేయడానికి సరే నొక్కండి.
- : రీలోడ్ బొత్తము ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాక్సీ ఆకృతీకరణను లోడ్ చేస్తుంది.
- Enable DNS over HTTPS: ఈ అమరిక పేర్కొనబడిన సర్వరు URL వాడి HTTPS ద్వారా DNS చేతనం చేస్తుంది కానీ ప్రత్యామ్నాయంగా సాధారణ DNSని వాడుతుంది. మరింత సమాచారం కోసం ఈ మొజిల్లా వికీ పేజి మరియు ఈ వ్యాసం చూడండి.