ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ మీరు ఒక కొత్త ట్యాబు తెరిచినప్పుడు చూడాలనుకునే విషయాన్ని ఎంచుకోనిస్తుంది. దానిని మీకు నచ్చిన జాలగూడుకు అమర్చుకోవచ్చు లేదా ఫైర్‌ఫాక్స్ అప్రమేయ ముంగిలి పుటను చూపించేట్టు అమర్చుకోవచ్చు. ఇది అత్యంత లోకప్రియమైన జాలగూడులు, Pocket (now part of Mozilla)లో ఎక్కువమంది చదివిన కథలు, మీరు ఈమధ్య చూసిన లేదా బుక్‌మార్క్ చేసిన లాంటి గొప్ప సమాచారాన్ని చూపిస్తుంది.
ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్‌లో "మేటి సైట్లు" ద్వారా మీరు ఇటీవల చూసిన లేదా బుక్‌మార్క్ చేసిన పేజీలను తెచ్చుకోవచ్చు. మీరు కొత్త వాడుకరి ఐతే, ఫైర్‌ఫాక్స్ అలెక్సా అత్యున్నత రాంకు గల సైట్లను చూపిస్తుంది. ఈ వ్యాసం సైట్లను పిన్ చేయడం, తీసివేయడం లేదా సవరించడం ద్వారా అత్యున్నత సైట్లను ఎలా నిర్వహించవచ్చో తెలుపుతుంది.
విషయాల పట్టిక
- 1 ప్యానెళ్ళను దాచడం లేదా క్రమం మార్చడం
- 2 మేటి సైట్ల వ్యానెలులో అదనపు విషయాన్ని చూపించుట లేదా దాచుట
- 3 థంబ్‌నెయిళ్ళను సవరించడం
- 4 వేరే వెబ్‌సైటుని మీ ముంగిలిపేజిగా ఉంచడం
- 5 సైటును పిన్ చేయడం లేదా తీసివేయడం
- 6 సవరించడం
- 7 తొలగించడం
- 8 పంచుకోవడం
- 9 చిరునామాని కాపీ చేసుకోవడం
- 10 ఒక సైటును చేర్చడం
- 11 మేటి సైట్ల తెరను దాచడం లేదా కనబడేలా చేయడం
ప్యానెళ్ళను దాచడం లేదా క్రమం మార్చడం
- కొన్ని పరికరాల్లో తెర కింద లేదా విహారిణిలో కుడిపైపు పైన మూలలో), తర్వాత తాకండి (ముందు మెనూని తాకాల్సిరావచ్చు). బొత్తాన్ని తాకి (
- తాకిన తర్వాత, తాకండి.
- మీరు దాచాలనుకుంటున్న లేదా క్రమం మార్చాలనుకుంటున్న ప్యానెలుపై నొక్కండి: మేటి సైట్లు, ఇష్టాంశాలు లేదా చరిత్ర.
- ఈ కింది ఎంపికలలో ఒకదానిని ఎంచుకోండి:
- అప్రమేయంగా చేయి: మీరు ఫైర్‌ఫాక్స్ తెరిచినప్పుడు లేదా కొత్త ట్యాబును తెరిచినప్పుడు మీకు మొదటగా ఈ ప్యానెల్ కనిపిస్తుంది.
- దాచు: ఈ ప్యానెలును ముంగిలి తెర నుంచి తీసేస్తుంది.
- క్రమం మార్చు: ప్యానెలును తెర ఎడమవైపుకో కుడివైపుకో కదుపుతుంది.
మేటి సైట్ల వ్యానెలులో అదనపు విషయాన్ని చూపించుట లేదా దాచుట
- కొన్ని పరికరాల్లో తెర కింద లేదా విహారిణిలో కుడివైపు పైన మూనలో), తర్వాత తాకండి (ముందు మెనూని తాకాల్సిరావచ్చు). బొత్తాన్ని తాకి (
- తాకిన తర్వాత, తాకండి.
- పై తాకండి.
- "అదనపు విషయం" కింద, మీరు చూడాలనుకుంటున్న ప్రతీ రకపు విషయం తర్వాత ఉన్న మీత నొక్కండి.
థంబ్‌నెయిళ్ళను సవరించడం
ఒక థంబ్‌నెయిల్‌పై ఒత్తి పట్టుకుంటే అది సైటు ఒక కొత్త లేదా అంతరంగిక ట్యాబులో తెరచుట, తీసివేయుట, ఇష్టాంశంగా గుర్తించుకోవడం, పంచుకొనుట, కాపీ లేదా పిన్ చేయుట అనే ఎంపికలనున్న మెనూని చూపిస్తుంది.
వేరే వెబ్‌సైటుని మీ ముంగిలిపేజిగా ఉంచడం
ఫైర్‌ఫాక్స్ అప్రమేయ ముంగిలి పేజి కాకుండా ఒక ప్రత్యేక జాలపుటని చూపించే సూచనలకు Change the Homepage to a specific page చూడండి.
సైటును పిన్ చేయడం లేదా తీసివేయడం
ఒక సైటు మేటి సైట్లలో అలాగే ఉండిపోవడానికి, మీ మేటి సైట్ల తెరకు "పిన్" చేయండి. ముందుగా, సైటు ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, మెనూ వస్తుంది.
- సైటును పిన్ చేయడానికి, అంశాన్ని తాకండి.
ఈ సైటు మీ ముంగిలి తెరకు పిన్ చేయబడుతుంది.
- దాని పిన్ను తీసివేయడానికి, పైన ఉన్న అంచెలను మళ్ళీ చేసి తాకండి.
సవరించడం
- ఒక సైటును సవరించడానికి, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో ఎంచుకోండి.
- ఇక్కడ మీరు చిరునామా మార్చవచ్చు.
తొలగించడం
- ఒక సైటును తొలగించేందుకు, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో ఎంచుకోండి.
పంచుకోవడం
- ఒక సైటును ఇతరులతో పంచుకునేందుకు, దాని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో ఎంచుకోండి.
- తర్వాత బ్లూటూత్, డ్రైవ్ లేదా ఇతర ఎంపికల ద్వారా పంచుకోండి.
చిరునామాని కాపీ చేసుకోవడం
- సైటు చిరునామా కాపీ చేసుకోవడానికి, ని ఫలకాన్ని ఒత్తి పట్టుకోండి, వచ్చే మెనూలో ఎంచుకోండి.
ఒక సైటును చేర్చడం
- ఒక సైటును చేర్చుకోడానికి, కూడిక చిహ్నంతో ఉన్న ఖాళీ ఫలకాన్ని తాకండి.
- తర్వాత జాలా చిరునామా ఇవ్వండి.
మేటి సైట్ల తెరను దాచడం లేదా కనబడేలా చేయడం
మెనూ బొత్తం నొక్కి (కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) ఎంచుకోండి (ముందుగా మీరు మీద తట్టవలసిరావొచ్చు) , తరువాత , ఆపై ఎంచుకోండి, చివరిగా ఎంచుకోండి.
- అక్కడ మీరు ఈ క్రింది మార్పులు చేసుకోవచ్చు:
- ముంగిలి నుండి మేటి సైట్లను దాయడానికి, ఎంచుకోండి.
- మేటి సైట్లు ఇప్పటికే దాయబడి మీరు దాన్ని ముంగిలిలో చూడాలనుకుంటే, ఎంచుకోండి.
- మేటి సైట్లను అప్రమేయం చేసేందుకు, ఎంచుకోండి.
- మేటి సైట్ల క్రమం మార్చుకోడానికి, ఎంచుకోండి.