మీ చరిత్ర, సంకేతపు మాటలు లేదా సైట్ ప్రాధాన్యతలను భద్రపరచకుండా వెబ్ పేజీలను సందర్శించడానికి ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్సులో ప్రైవేట్ ట్యాబును ఉపయోగించుము.
రహస్య విహరణ ఏమి భద్రపరచదు?
- సందర్శించిన పేజీలు
- ఫారంలు మరియు శోధన ఎంట్రీలు
- సంకేతపు మాటలు
- దింపుకోళ్లు (దింపుకోలు అయిన ఫైళ్ళు ఇంకా మీ పరికరంలోనే భద్రపరచబడతాయి, కానీ అవి ఫైర్‌ఫాక్సు దింపుకోలు చరిత్రలో కనిపించవు)
- కుకీలు
- తాత్కాలిక ఇంటర్నెట్ ఫైళ్లు (కాష్ అయిన ఫైళ్లు)
ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్సుతో ఒక నిజమైన రహస్య విహరణ అనుభవాన్ని పొందండి. ప్రైవేట్ ట్యాబును ఉపయోగించి జాడలు లేకుండా లేదా ఎవరూ వెంబడించకుండా వెబ్సైట్లను సందర్శించండి.
రహస్య విహరణ:
- చరిత్ర, సంకేతపు మాటలు మరియు నమోదులు భద్రపరచకుండా అడ్డుకుంటుంది
- ఫారంలు, శోధన క్షేత్రాల స్వయంపూరణను ఆపుతుంది
- కుకీలను అడ్డగిస్తుంది
- తాత్కాలిక ఇంటర్నెట్ ఫైళ్లు నిరోధిస్తుంది
- మీరు సందర్శించే వెబ్ పేజీల్లో మూడవ పార్టీ ట్రాకింగ్ అంశాలను అడ్డగిస్తుంది (చిట్కా: మీరు ఏ సమయంలో అయినా దీన్ని ఆపివేయవచ్చు. ఆండ్రాయిడ్ కోసం ఫైర్ఫాక్సు ట్రాకింగ్ రక్షణ చూడండి.
విషయాల పట్టిక
ఒక ప్రైవేట్ ట్యాబు తెరువు
- ఒక ఖాళీ, ప్రైవేట్ ట్యాబు తెరువు: ఫైర్ఫాక్సు కొన్ని పరికరాల్లో తెర అడుగున లేదా విహారిణి కుడివైపు పైన మూలలో) , ఆపై తట్టండి. బొత్తాన్ని తట్టండి (
- ఒక ప్రైవేట్ ట్యాబులో లంకెను తెరువు: మెను చూపించడానికి మరియు ఎంచుకోవడానికి లంకెపై దీర్ఘగా నొక్కండి.
ఓపెన్ ప్రైవేట్ ట్యాబ్లు చూడండి
మీ స్క్రీన్ ఎగువన ట్యాబులో చిహ్నాన్ని నొక్కండి,అప్పుడు మీరు రహస్య విహరణలో తెరిచిన సైట్లు వీక్షించడానికి ముసుగు చిహ్నాన్ని నొక్కండి.
ఒక టాబ్ మూసివేయడానికి, మీరు మూసివేయాలనుకున్న ట్యాబు పక్కన ఉన్న
బొత్తాన్ని నొక్కండి. మీరు మెను బొత్తాన్ని నొక్కడం ద్వారా అన్ని తెరిచిన ట్యాబులను మూసివేయవచ్చు, తర్వాత .