ఈ మాటలు చదువుతున్నందకు కృతజ్ఞతలు - అంటే మీరు మొజిల్లా తోడ్పాటుకి సహాయపడాలని అనుకుంటున్నారమాట. ఫైర్‌ఫాక్స్ వాడుకరులలో సగం మందికి పైగా ఆంగ్లం కాని భాషల్లోనే మాట్లాడుతారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి వారికి తోడ్పాటు అందుబాటులో ఉండేందుకు మేము మీలాంటి ఔత్సాహికుల మీదే ఆధారపడతాం.
కొత్త స్థానికీకరులను మా సమూహం లోనికి మేము ఎప్పుడూ సంతోషంగా ఆహ్వానిస్తాం. మా వద్ద ఇప్పటికే మీ భాష ఉందేమో తెలుసుకోడానికి, దయచేసి మా అందుబాటులో ఉన్న భాషల జాబితాను చూడండి. ఒకవేళ లేకపోతే, దాన్ని మా పేజీలకు చేర్చడానికి మీతో పనిచేయడానికి మేము సిద్ధం. జాబితాలో మీ భాష ఉంటే, దాని పేరు మీద నొక్కి ఆ భాషపై పనిచేస్తున్న లొకేల్ లీడర్లను చూడవచ్చు. సుమో వ్యాసాలను మీ భాష లోనికి ఎలా అనువదించాలో తెలుసుకోడానికి మీరు వారిని సంప్రదించవచ్చు.
నేను స్థానికీకరుడిని/రాలిని కావాలనుకుంటున్నాను. నేనేం చేయాలి?
ముందు విషయాలు ముందు:
- సుమో ఖాతా సృష్టించుకోండి, అది మీరు మా కమ్యూనిటీ l10n ఫోరమ్‌లో వ్రాయడానికీ, సుమోలో మీరు చూసే ఏ వ్యాసాన్నైనా అనువదించడానికి మీకు వీలుకల్పిస్తుంది.
- ఒకసారి మీకు ఖాతా వచ్చిన తర్వాత, మా l10n కమ్యూనిటీ ఫోరమ్ను చూసి అక్కడ మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మా సమూహం మీ సందేహాలను తీర్చి మీరు మొదలుపెట్టడానికి తోడ్పడగలదు.
మా భాష లోనికి ఇప్పటికే జనాలు అనువదిస్తుంటే?
ఒకవేళ మీ భాష అందుబాటులో ఉన్న భాషల జాబితాలో ఉంటే, లొకేల్ లీడర్ పేరుపై నొక్కి వారికి అంతరంగిక సందేశం పంపించండి. సిగ్గు పడకండి, మీ సందేశం చూసి వారు ఆనందిస్తారు- ఎంత ఎక్కువైతే, అంత మంచిది!
కొంత సమయం తర్వాత కూడా (కనీసం కొన్ని రోజులలో - వారు సెలవుల్లో లేదా బాగా బిజీగా ఉండొచ్చు) లొకేల్ లీడర్ మీకు జవాబివ్వకపోతే, మరో లొకేల్ లీడర్‌ను సంప్రదించండి లేదా Michałకి అంతరంగిక సందేశం పంపించండి, అతను మీరు మొదలుపెట్టడానికి తోడ్పడతాడు.
మా భాషలో అసలు ఏ సమాచారమూ లేకపోతే?
మా అందుబాటులో ఉన్న భాషల జాబితాలో మీ భాష లేకపోతే, దయచేసి Michałకి అంతరంగిక సందేశం పంపించండి, ఏం చేయాలో అతనితో కలిసి చర్చించవచ్చు.
అన్ని వ్యాసాలు
- మొజిల్లా అనువాద సహాయం (మీరు ఇక్కడ ఉన్నారు)
- తోడ్పాటు స్థానికీకరణ ఎలా పనిచేస్తుంది?
- Translating an article
- How do I update articles after their first translation?
- L10N guidelines for reviewing translated articles
- How to be a SUMO Locale Leader
ఈ జాబితాలో ఏదైనా ఉండాల్సిన వ్యాసం లేదనుకుంటే, Michałని సంప్రదించండి